Sunday, May 19, 2024
- Advertisement -

2017 ఎలా ముగుస్తుందో.. నాని మిన‌హా అంద‌రూ ఫ్లాపు హీరోలే

- Advertisement -

డిసెంబ‌ర్ నెల‌ను సినిమాలు వ‌రుస పెట్టి వ‌స్తున్నాయి. 2017 సంవ‌త్స‌రం ముగింపు ద‌శ‌లో వెండి తెర‌కు పండ‌గే. థియేట‌ర్ల‌న్నీ ఫ్రెష్ సినిమాల‌తో నిండిపోనున్నాయి. దాదాపు 20 నుంచి 40 సినిమాలు వ‌చ్చే అవ‌కాశం ఉన్నాయి. ధానంగా సాయిధరమ్ తేజ్, సుమంత్, అఖిల్, నాగశౌర్య, అల్లు శిరీశ్ సినిమాలు తెర‌పై ప‌డ‌నున్నాయి. వీటితో పాటు తెలుగు చిన్న సినిమాలు, ప‌లు డ‌బ్బింగ్ సినిమాలు కూడా వెండితెర‌పై రానున్నాయి.

న‌వంబ‌ర్ 30వ తేదీన ఆక్సిజ‌న్ పేరుతో గోపీచంద్ వ‌చ్చి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాడు. రాశీఖ‌న్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. మంచి సందేశాత్మ‌క చిత్రంగా ముద్ర ప‌డింది.

ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ డిసెంబ‌ర్ 1వ తేదీన జ‌వాన్‌తో థియేట‌ర్ల‌కు వ‌చ్చాడు. ఆ సినిమా కూడా మంచి రివ్యూలు వ‌స్తున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. వీరిద్ద‌రూ కొంచెం ట్రాక్ మీద‌కు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నారు.

డిసెంబర్ 8వ తేదీన మ‌ళ్లీ రావా అంటూ ఏఎన్నార్ కుటుంబం నుంచి సుమంత్ వ‌స్తున్నాడు. అత‌డికి ఇటీవ‌ల అస‌లే మాత్రం క‌లిసి రావ‌డం లేదు. అందుకే కొంచెం శ్ర‌ద్ధ తీసుకునొ ఏడాదిన్న‌ర తర్వాత వ‌స్తున్నాడు. అయితే ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి.

డిసెంబర్ 22వ తేదీన అక్కినేని వార‌సుడు అఖిల్ థియేట‌ర్ల‌లో “హలో” చెబుతున్నాడు. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. అఖిల్ సినిమా ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న ఈ వార‌సుడు హిట్ కోసం తాప‌త్ర‌యం ప‌డుతున్నాడు.

డిసెంబర్ 21వ తేదీన వరుస హిట్స్‌తో ఊపుమీదున్న న్యాచుర‌ల్ స్టార్ నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా (ఎంసీఏ) వ‌స్తున్నాడు. క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రానుంది. నాని స‌ర‌స‌న ఫిదా ఫేమ్ భానుమ‌తి అదే సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. వీరిద్ద‌రి స‌హ‌జ న‌ట‌న‌తో సినిమా ఈపాటికే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కాక‌ముందే హిట్ తెచ్చుకున్న సినిమాగా పేరు పెందుతోంది.

డిసెంబర్ 23వ తేదీన అల్లు వార‌సుడు శిరీశ్ ఒక్క క్షణం సినిమా వ‌స్తున్నాడు. హ‌ర్ర‌ర్ క‌థాంశంతో ఈ సినిమా రానుంది.

డిసెంబ‌ర్ 29వ తేదీన యువ న‌టుడు నాగ‌శౌర్య చ‌లో అంటూ రానున్నాడు. ఇది కూడా థ్రిల్ల‌ర్, అండ్ స‌స్పెన్స్ క‌థాంశంతో వ‌స్తోంది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆశ‌లు పెరిగాయి.

హాస్య‌న‌టుడి నుంచి హీరోగా మారిన సునీల్ టూ కంట్రీస్ సినిమాగా వ‌స్తున్నాడు. అయితే ఈ సినిమా విడుద‌ల ఈ నెల‌లోనే ఉంటుంద‌ని టాక్‌. అత‌డికి ఓ విజ‌యం కావాలి.

ఇవ‌న్నీ అధికారికంగా ప్ర‌క‌టించిన సినిమాలు మాత్ర‌మే. ఈ నెల రోజుల్లో ప‌లు చిన్న సినిమాలు కూడా రానున్నాయి. అప్ప‌టిక‌ప్పుడు నిశ్చ‌యించుకొని వ‌చ్చే సినిమాలు రెడీ ఉన్నాయి. అయితే నాని, అఖిల్ సినిమాల‌తో కొంచెం వేచి చూస్తున్నారు. ఆ సినిమాల ఫ‌లితంపై మిగ‌తా సినిమాలు విడుద‌ల కావాల‌? వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుంటారు.

ఒక్క నాని మిన‌హా తెర‌పైకి వ‌స్తున్న న‌టీన‌టులంద‌రూ ఫ్లాపుల‌తో బాధ‌ప‌డుతూ ఉన్న‌వారే. వారు విజ‌యం కోసం ఆరాట‌ప‌డుతున్నారు. త‌మకు ఈ సినిమాలు విజ‌యం సాధిస్తేనే భ‌విష్య‌త్‌పై ఆశ‌లు ఉండే అవ‌కాశం. సాయిధ‌ర‌మ్ తేజ్‌, సుమంత్‌, అఖిల్‌, అల్లు శిరీశ్‌, నాగశౌర్య త‌దిత‌రుల సినిమాల‌పై ప్రేక్ష‌కులు ఏ విధంగా ఆద‌రిస్తారో చూడాలి. 2017 సంవ‌త్స‌రాన్ని ఘ‌నంగా ముగిస్తారో లేదో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -