Saturday, April 27, 2024
- Advertisement -

రాజమౌలి, ఆయన తండ్రికి మధ్య యుద్దం!

- Advertisement -

బాలివుడ్‌లో బాహుబలి వసూళ్ళ రికార్డ్స్‌ను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అడ్డుకునేటట్లు కనిపిస్తోంది. సల్మాన్ తాజా సినిమా భజరంగి… భాయ్ జాన్‌ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ రావటంతో ఇక బాహుబలి వసూళ్ళు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

భారత్, పాక్ ఇతి వృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాకు స్క్రీన్‌ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించారు. దర్శకుడితో కలిసి స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. ఈ సినిమాపై టాలివుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి వసూళ్ళ పరంగా దూసుకుపోతున్న సమయంలో కండలవీరుడు సల్మాన్ సినిమా అడ్డు పడింది. ప్రతి సంవత్సరం రంజాన్‌కు తన సినిమా వచ్చేటట్లు చేసుకునే సల్మాన్, ఈ సినిమా కూడా అలానే ప్లాన్ చేసుకున్నాడు.

కానీ అది బాహుబలి సినిమాకు బాగా ఎఫెక్ట్ అయింది. ఈ రెండు సినిమాలకు రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి సినిమాకు రాజమౌళి తండ్రే శత్రువు అయ్యాడు అని అనటంలో అతిశయోక్తి లేదు. ఇది పక్కన పెడితే తన తండ్రి కథ అందించిన బాలివుడ్ సినిమా హిట్ అవ్వడం రాజమౌళికి గుడ్‌ న్యూస్. ఈ సంవత్సరం మొత్తానికి రెండు భారీ సినిమాలు జక్కన్న ఫ్యామిలీ నుంచి రావడం విశేషం.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -