Saturday, April 27, 2024
- Advertisement -

ఐపీఎల్ కు పవర్ ఫుల్ షాక్…!

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో బీసీసీఐకి ఒక పవర్ ఫుల్ షాక్ తగిలింది. ఇంత వరకూ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న పెప్సీ ఆ హోదా నుంచి వైదొలిగింది. ఇన్ని రోజులూ పెప్సీ ఐపీఎల్ గా వ్యవహరించే వారు కదా.. ఇకపై అలా జరగదు. ఆ హోదా నుంచి పెప్సీ వైదొలగడంతో బీసీసీఐ వేరే స్పాన్సర్ ను వెదుక్కోవాల్సి వస్తోంది.

ఐపీఎల్ కు వచ్చిన చెడ్డపేరుతోనే స్పాన్సర్ హోదా నుంచి పెప్సీ వైదొలిగినట్టుగా వార్తలు వస్తుండటం ఇప్పుడు బీసీసీఐకి మరింత ఇబ్బందికరంగా మారింది. అంతే కాదు.. ఆర్థికంగా కూడా ఇది బీసీసీఐకి నష్టం చేకూర్చే అంశమే. ప్రతియేటా బీసీసీఐకి పెప్సీ నుంచి భారీ మొత్తమే అదుతోంది.టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల కోసం పెప్సీ వందల కోట్ల రూపాయలు బీసీసీఐ చేతిలో పెడుతోంది.

అయితే… ఇప్పుడు పెప్సీ ఆ హోదా నుంచి వైదొలగడంతో బీసీసీఐ ఐపీఎల్ కోసం మరో స్పాన్సర్ ను తెచ్చుకోవాల్సి వస్తోంది. మరి ఇప్పుడు అదంత సులభకరమైన వ్యవహారమేమీ కాదు. ప్రత్యేకించి… పెప్సీ స్పాన్సర్ షిప్ హోదా నుంచి వైదొలిగినందుకు ఉన్న రీజన్లు ఐపీఎల్ ను దెబ్బతీసేవిలా ఉన్నాయి. స్పాట్ ఫిక్సింగ్ తదితర వివాదాలతో ఐపీఎల్ చెడ్డపేరు తెచ్చుకుంది. అలాంటి లీగ్ ను తాము స్పాన్సర్ చేయలమనే ఉద్దేశంతోనే పెప్సీ  స్పాన్సర్ హోదా నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఐపీఎల్ కు మరో స్పాన్సర్ గా ఎవరొస్తారో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -