Saturday, May 4, 2024
- Advertisement -

నా పేరు సూర్య…… సెన్సార్ టాక్, రన్ టైం, హైలైట్స్ ఇవే

- Advertisement -

సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో షేక్ అయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రంగస్థలం సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చింది. ఇక భరత్ అనే నేను సినిమా టాక్ ఎలా ఉన్నా ఆ కలెక్షన్స్ ఊపు కొనసాగిస్తోంది. ఇప్పుడిక స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తా చూపించడానికి బాక్స్ ఆఫీస్‌పై దండయాత్రకు వస్తున్నాడు.

రీెసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు యూ బై ఎ సర్టిఫిక్ ఇచ్చారు. హింసాత్మక దృశ్యాలు ఉన్నాయని యూ బై ఎ ఇచ్చారు. యాటిట్యూడ్ ఉన్న యాంగ్రీ యంగ్ మేన్‌గా బన్నీ నటన హైలైట్ అని సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ స్టైల్‌లో సాగే ఈ కథలో బన్నీ యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేయడం ఖాయం అట. అలాగే సరైనోడు సినిమాలో కంటే ఇంకా ఎక్కువగా బన్నీ బాడీ ప్రొజెక్ట్ చేశారు అని తెలుస్తోంది. కామెడీ పాళ్ళు తక్కువే ఉన్నప్పటికీ చివరి ఉత్కంఠ, ఉద్విగ్న క్షణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అన్నింటికీ మించి తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ సూపర్ హైలైట్ అవుతుందని సెన్సార్ మెంబర్స్ చెప్పారు. ఇక అర్జున్ రెడ్డి తర్వాత ట్రెండ్ మార్చిన డైరెక్టర్స్ లిస్టులోనే కొత్త డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా చేరిపోయాడు. సినిమా రన్ టైం 2 గంటలా 47 నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. అర్జున్ రెడ్డి, రంగస్థం, భరత్ అనే నేను సినిమాల్లాగే నా పేరు సూర్య కూడా దాదాపు మూడు గంటల నిడివితో రానుంది. నా పేరు సూర్య కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తే మాత్రం టాలీవుడ్‌కి పండగే అని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -