Sunday, May 5, 2024
- Advertisement -

టిడిపి, బిజెపిలకు షాక్… వైకాపాలోకి బిజెపి అగ్ర నేతల వరుస చేరికలు..

- Advertisement -

2014 ఎన్నికల్లో మోడీ ఇమేజ్‌ని, బిజెపి బలాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్ళపాటు రాష్ట్రానికి బిజెపి ఏమీ చేయకపోయినప్పటికీ సిగ్గు విడిచిన సంసారం చేశాడు. ఇక ఇప్పుడు మాత్రం 2019 ఎన్నికల్లో మైలేజ్ కోసం బిజెపి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే రాజకీయాలు అంతే సిగ్గులేకుండా చేసుకుపోతున్నాడు. అందులో భాగంగానే బిజెపిని ఎంతలా బలహీనపరచాలో అంతా చేస్తున్నాడు. బిజెపి సీనియర్ నాయకులను టిడిపిలోకి లాగాలని తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే బిజెపి నాయకులు మాత్రం చంద్రబాబుకు షాక్ ఇస్తున్నారు. బిజెపి బలహనీపడితే ఆ పార్టీ సీనియర్ నాయకులు అందరూ టిడిపిలో చేరతారని……2019 ఎన్నికల్లో టిడిపి గెలుపుకు సహకరిస్తారని బాబు భావిస్తే ఆయా నాయకులు మాత్రం చంద్రబాబుకు సూపర్ షాక్ ఇస్తూ వైకాపాలో చేరుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ మాట్లాడారు. సీటు ఆఫర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కన్నా మాత్రం వైకాపాలో చేరడానికే నిర్ణయించుకున్నాడు. అతి త్వరలో జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకోనున్నాడు కన్నా. అలాగే కర్నాలు జిల్లా బిజెపి నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా త్వరలోనే వైకాపాలో చేరనున్నాడు.

ఇప్పుడు ఈ చేరికలే బాబులో ఆందోళన పెంచుతున్నాయి. బిజెపిని పూర్తిగా బలహీనపరిస్తే ఆ పార్టీ సీనియర్ నాయకులు అందరూ టిడిపిలో చేరతారని బాబు భావించాడు. అయితే చంద్రబాబుతో సహా ఎవ్వరూ ఊహించని విధంగా ఆయా నాయకులు వైకాపాలో చేరుతూ ఉండడం మాత్రం టిడిపి నేతలు ఆందోళన చెందేలా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -