Monday, May 6, 2024
- Advertisement -

నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకానంద‌రెడ్డి ఇక‌లేరు..

- Advertisement -

రాజకీయ నేతగా కంటే కూడా తన లైఫ్ స్టైల్ తోనే ఆనం వివేకానందరెడ్డి చాలా పాప్యులర్ అయ్యారు. ఆయన నడవడిక, మాట్లాడే తీరు, ప్రత్యర్థులను విమర్శించే తీరు అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ఏదైనా నిర్మొహ‌మాటంగా బ‌య‌ట‌కు చెప్పేతీరు ఆయ‌న‌ది.

వాక్చాతుర్యంలో వివేకాను మించినవారు లేరనే చెప్పాలి. ఆయన వేసే సెటైర్లు అందరికీ కడుపుబ్బ నవ్వును తెప్పించేవి. ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం. గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఆనం వివేకానందరెడ్డి ఒకరు. ఆనం వివేకా సోదరుడు, టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా, ఆర్థికమంత్రిగా గతంలో పలు శాఖలు నిర్వహించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించే ఆనం వివేకా.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన 1950 డిసెంబర్‌ 25న జన్మించారు. ఆనంకు భార్య హైమావతి ఆనం, సంతానం ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్‌ రెడ్డి ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -