Friday, May 3, 2024
- Advertisement -

నా పేరు సూర్య తొలివారం క‌లెక్ష‌న్లు

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా మొద‌టి వారం పూర్తి చేసుకుని రెండువ వారంలోకి అడుగు పెట్టింది. సినిమా రీలిజ్ రోజున నుండి యావ‌రేజ్ టాక్‌తో న‌డుస్తుంది.సినిమా హిట్ అని చిత్ర యూనిట్ ప‌బ్లిసిటి చేసుకున్న ప‌ట్టించుకున్న వారు లేరు.దీని ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్ల మీద ప‌డింది. సినిమా ఇంకా చాలా రాబ‌ట్ట‌ల్సింది ఉంద‌ని చెబుతున్నాయి ట్రెడ్ వ‌ర్గాలు.తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి వారంలో 34.43 కోట్లు క‌లెక్ట్ చేసిన ఈ సినిమా ,ప్ర‌పంచ వ్యాప్తంగా 44.63 కోట్లు క‌లెక్ట్ చేసింది.

తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లో 11.10 కోట్లను వసూలు చేసింది.డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడాలంటే ఈ సినిమా ఇంకా 36 కోట్లకి పైగా షేర్ ను రాబట్టవలసి వుందని అంటున్నారు.ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ .. అటు ఓవర్సీస్ లోను ‘మహానటి’ మంచి జోరుమీద దూసుకుపోతోంది. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో నా పేరు సూర్య సినిమా అంత క‌లెక్ట్ చేయ‌డం అంటే చాలా క‌ష్టం.ఈ సినిమాతో ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచియ‌మైయ్యాడు.సినిమా మొద‌టి భాగం బాగానే ఉన్న‌ప్ప‌టికి సినిమా రెండువ భాగం బాలేద‌నే క‌మెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -