Saturday, April 27, 2024
- Advertisement -

క్లైమాక్స్ షూటింగ్ లో నాకు ఇంకోపేరుంది

- Advertisement -

జి‌వి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది.

‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ.. “యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. చిత్రీకరణ బాగా జరుగుతుంది. మేము అనుకుంటున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తుంది. రజనీకాంత్ గారి ‘బాషా’లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. సినిమా పేరుకు యువత నుంచి మంచి స్పందన లభించింది. చిత్రంలో నా పేరు జాని. 1980లో ‘జాని’ పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.      

ఈ చిత్రానికి 

సంగీతం : జి‌వి ప్రకాష్

కెమెరా : కృష్ణన్ వసంత్

ఎడిటర్ : రుబెన్

స్టంట్స్ : దిలీప్ సుబ్రాయన్

ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్ 

ప్రొడ్యూసర్ :  లైకా ప్రొడక్షన్  

కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటోన్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -