- Advertisement -

చిరంజీవి 150వ సినిమాకి అనుకోని అడ్డంకి!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రం కోసం. తమిళంలో హిట్టయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కించనున్నారు. వివి వినాయక్  దర్శకత్వంలో వహించబోతున్నాడు.

తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్. ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినా.. ఇప్పుడు మరో సారి ఈ సినిమా వాయిదా పడక తప్పడం లేదట.

చిరు చిన్న కూతురు శ్రీజ వివాహం పనుల్లో చిరు చాలా బిజీగా ఉన్నాడు. మార్చి 28న వివాహ ముహూర్తం నిశ్చయించినట్లు సమాచారం. సో చిరు సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చిరుకు కాబోయే అల్లుడి పేరు కళ్యాణ్. సో మరి చిరు సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -