Monday, May 20, 2024
- Advertisement -

జివి ప్రకాష్ ‘నాకు ఇంకో పేరుంది’ మోషన్ పోస్టర్

- Advertisement -

సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జి‌వి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది.  ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. జివి ప్రకాష్ హీరోగా ఫామ్ లో ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే తాజా విషయం ఏమిటంటే ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ కథానాయిక సమంతా తన ట్విటర్ ఖాతా నుండి ఈరోజు  సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ.. “యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. చిత్రీకరణ బాగా జరుగుతుంది. మేము అనుకుంటున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తుంది. రజనీకాంత్ గారి ‘బాషా’లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. చిత్రంలో నా పేరు జాని. 1980లో ‘జాని’ పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమంతా మా చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేయనుండటం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

ఈ చిత్రానికి  సంగీతం : జి‌వి ప్రకాష్, కెమెరా : కృష్ణన్ వసంత్, ఎడిటర్ : రుబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్రాయన్, ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్,ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్ , ప్రొడ్యూసర్ :  లైకా ప్రొడక్షన్  , కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -