Sunday, May 12, 2024
- Advertisement -

ఊపిరి వెనుకల ఇంత మోసమా..!?

- Advertisement -

నాగార్జున – కార్తి – తమన్నాలు నటించిన చిత్రం ఊపిరి. ఈ నెల 25న రిలీజ్ కు రెడి అవుతుది. ఈ సినిమాపై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సినిమాకి సంబంధించి  టైటిల్ వెనుక పెద్ద కథే ఉందట. ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ఊపిరి అని టైటిల్ ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాక.. ఎవరైన ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారోమో అని తెలుసుకున్నాడట.

ఐతే అప్పటికే నటుడు రాజా రవీంద్ర ఊపిరి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నాడని తెలియడంతో.. అతడిని అప్రోచ్ అయ్యాడట వంశీ. ఐతే ఈ టైటిల్ మా సినిమాకి బాగుంటుందని తమకు ఇవ్వాలని.. రాయల్టీగా సినిమాలో ఓ పోలీసాఫీసర్ పాత్రను ఇస్తాననే ప్రపోజల్ పెట్టాడట వంశీ. రాజా రవీంద్ర సంతోషించి ఊపిరి టైటిల్ ఇచ్చేస్తున్నట్లు సంతకం చేసేశాడని టాక్. ఐతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళగానే అసలు విషయం బయట పడింది.

తన పాత్ర చాలా చిన్న పాత్రని అని అది కూడా ఒకే ఒక్క డైలాగ్ ఉన్న రోల్.. ఏ జూనియర్ ఆర్టిస్ట్ తో చేయించినా సరిపోతుందని అర్ధమైందట. అయినా ఏం చేయలేక తన రోల్ చేసేసి వెళ్లిపోయాడు రాజా రవీంద్ర. ఇదే అవమానం అనుకుంటే దీనికి మించిన అవమానం మారోకటి జరిగింది. తన టైటిల్‍ను ఉచితంగా  ఇచ్చేసిన రాజారవీంద్రను.. ఆడియో ఫంక్షన్ కు కనీసం అహ్వానించలేదట దర్శకుడు వంశీ. కొన్ని పనుల్లో బిజీగా ఉండి పిలవలేకపోయానని కథ చెప్పాడట వంశీ. తనకు కావాల్సిన టైటిల్ దొరికింది తర్వాత పట్టించుకుంటారా ఏంటి? అంతే కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -