కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయన వల్లనే అయ్యిందని చెప్పవచ్చు. పోరాటంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన నిర్ణయాలు, కార్యాచరణతో తెలంగాణ ఉద్యమం విజయవంతంగా నడిచింది. ఒక్క రక్తపు చుక్క లేకుండా ఉద్యమం శాంతియుత వాతావరణంలో కొనసాగి చివరకు 60 ఏళ్ల కల ఫలించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కోదండరాం తన పని అపోయిందని భావించి కొన్నాళ్లు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిణామాలపై విసుగు చెందిన కోదంరాం రాజకీయాల్లోకి వచ్చేశారు. తన జీవితమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అని ప్రకటించి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఈ రాజకీయాలతో విసిగిపోయి తానే ఒక కొత్త పార్టీని స్థాపించినట్లు చివరకు ప్రకటించారు. నాడు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ మాదిరి శాంతియుత వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కోదండరాంను తెలంగాణ గాంధీగా పేర్కొంటున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనిలపై చిరాకుగా ఉన్నారు. తాను పోరాటం చేసింది ఇలాంటి తెలంగాణ కోసమా అని ప్రభుత్వ తీరుపై ఆందోళనలో ఉన్నారు. ఎలాగైనా తన రాష్ట్రాన్ని బతికించుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి రానున్నాడు. కొత్త వేదికగా రాబోతున్నాడు.
త్వరలో కొత్త పార్టీ ఏర్పాటుచేయనున్నటు్ల తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం ప్రకటించారు. పార్టీ పేరు, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ‘తెలంగాణ జన సమితి (టీజేఎస్)’ పార్టీ పేరుగా ఉండనుందని సమాచారం. కోదండరాం పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాజకీయాలు రసకందాయంగా ఏర్పడుతోంది. రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, వలసలు.. ఈ నాలుగు అంశాలు ప్రధానంగా ఉండేలా పతాకాన్ని, గుర్తునూ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ ఏర్పడినా రాష్ట్రంలో ఐకాస కొనసాగుతుందనీ, ఐకాస ఆధ్వర్యంలో సమాంతరంగా రాజకీయ, సామాజిక ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల్లో గుబులు
కోదండరాం పార్టీ ప్రకటనతో రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టాయి. కోదండరాంను తమ పార్టీల్లోకి చేర్చుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన చేరలేదు. చివరకు తమకు ఎసరు పెట్టేలా కోదండరాం నిర్ణయం తీసుకోవడతో పార్టీలు ఏం చేయాలోనని తలలు పట్టుకుంటున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ముచ్చెమటలు పెట్టించే అవకాశం ఉంది.
