Friday, May 17, 2024
- Advertisement -

ట్రైలర్ బాగానే ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో?

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టించిన సినిమా దేవ‌దాస్.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌కు సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.నిన్న‌(గురువారం) దేవ‌దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా సినిమా ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

అందుకే ‘మాఫియా సార్ .. వాళ్లతో పెట్టుకోకూడదు’ .. ‘ డాక్టర్ సార్ .. మాతో అబద్ధం ఆడకూడదు’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘పాకెట్ లో గన్ పెట్టుకుని తిరిగేవాడితో పరిచయం పెంచుకోకూడదు .. ఏ క్షణమైనా బులెట్ దిగొచ్చు’ అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్ కూడా పేలింది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయింతి బ్యాన‌ర్‌పై అశ్వీనీద‌త్ నిర్మిస్తున్నారు.. ఆకాంక్ష సింగ్ .. రష్మిక మందన కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకులముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -