Tuesday, April 30, 2024
- Advertisement -

‘ఆఫీసర్’ షోలు ఆపేస్తున్నారుగా…!

- Advertisement -

నాగ‌ర్జున-రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో 28 ఏళ్ల త‌రువాత వ‌చ్చిన సినిమా ఆఫీస‌ర్‌.ఈ సినిమా గ‌త శుక్ర‌వారం థియోట‌ర్ల‌లోకి వ‌చ్చింది.ఎందుకనో ఈ సినిమాపై మొద‌టి నుండి ఎవ‌రు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. టీజ‌ర్‌,ట్రైల‌ర్ చూసిన త‌రువాత ఈ సినిమాపై ఎవ‌రికి పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు.సినిమా మొద‌టి రోజు వ‌సూళ్లు చూస్తే ఇది నిజ‌మే అని అర్థం అవుతుంది.ఆఫీస‌ర్ మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు చూస్తే మ‌తి పోతుంది.సినిమా మొద‌టి రోజు కేవ‌లం 45 ల‌క్ష‌లు క‌లెక్ట్ చేసిందంటే సినిమా ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.

నాగ‌ర్జున కెరీర్‌లో ఇంత‌టి దారుణ ఫ‌లితాన్ని ఎప్పుడు చూడలేదు.గుంటురుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాడానికి కూడా సిద్ధం అయ్యాడు అంటే సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉందో చూస్కోండి.ఇక థియేటర్లన్నీ వెలవెలబోతుండటంతో ఎవ్వరైనా ఏం చేస్తారు. సినిమాను స్వచ్ఛందంగా ఆపేయ‌ల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తుంది.ఆఫీస‌ర్ సినిమాతో పాటు రిలీజ్ అయిన విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాతో ఆఫీసర్ థియోట‌ర్స్‌ను రీప్లేస్ చేసేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -