Thursday, May 2, 2024
- Advertisement -

ఏముంది ‘ఆఫీస‌ర్‌’

- Advertisement -

నాగ‌ర్జున హీరోగా రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఆఫీస‌ర్‌.సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు(శ‌నివారం) రీలిజ్ చేశాడు వ‌ర్మ‌.నాగర్జున -వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమా అంచనాలు విపరీతంగా పెరిగిపొయ్యాయి.గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శివ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నాళ్లుకు వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌డంతో సీని అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది.కాని ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు టీజ‌ర్‌ల‌లో కొత్త‌ధ‌నం లేక‌పొగ‌, వ‌ర్మ పాత చిత్రాల‌ను గుర్తుకు తెచ్చాడు వ‌ర్మ‌.

ఇప్పుడు తాజాగా ఆఫీస‌ర్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.ఆఫీస‌ర్ ట్రైల‌ర్ ఎలా ఉంద‌నే దానికన్నా రెండు టీజ‌ర్‌ల‌ను క‌లిపి ట్రైల‌ర్‌గా విడుద‌ల చేశారంటే మేలు.గ‌తంలో విడుద‌ల చేసిన టీజ‌ర్‌ల‌ను ట్రైల‌ర్‌గా విడుద‌ల చేశాడు వ‌ర్మ‌.ట్రైల‌ర్‌లో కొత్త‌గా ఏమి లేదు.పైగా ట్రైల‌ర్ మొత్తం 1 నిమిషాం 56 సెక‌న్లు.ఇందులో 1 నిమిషాం 05 సెక‌న్ల పాటు గ‌న్స్ మోత‌తో హ‌డ‌ల్ పుట్టించాడు వ‌ర్మ‌. ముంబై మాఫీయా నేప‌థ్యంలో సినిమా సాగ‌నుంది.ఆఫీసర్ సినిమా ఈ నెల‌(మే) 25న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంది.మ‌రి ఈ సినిమా అయిన వ‌ర్మ‌కు స‌క్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -