నిహారికా. ఈటీవీలో ఢీజే షోతో పిచ్చ పాపులారిటీ సంపాదించుకున్న మెగా బ్యూటీ. నాగబాబు కూతురుగా పరిశ్రమకు పరిచయమైనటువంటి నిహారిక…. ఇపుడు హీరోయిన్ గా కూడా చేస్తోందని గత వారం రోజులుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి.
దీనికి తన పెద్దనాన్న చిరంజీవి ఆశీర్వాదం కూడా తోడైందని చెబుతున్నారు. నాగబాబు సైతం…. ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తన కూతురుదేనని చెప్పేశాడు. ఇదంతా భాగానే ఉంది కాని…ఫైనల్ గా నిహారిక చూపు ఎటనేదే ఎవ్వరికీ తెలియకుండా ఉంది. మొన్నామధ్య ఇదే విషయంలో నిహా…తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై ఫుల్ ఇంట్రెస్ట్ ను చూపించిందట. తాజాగా జరిగిన పరిణామాలతో అమ్మాయిగారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. మెగా కాంపౌండ్ లో కొందరికి నిహారిక స్క్రీన్ నై కనిపించడం ఏమాత్రం ఇష్టం లేదని కూడా చెబుతున్నారు. హీరోయిన్ అంటూ మన ఇంటా వంటా లేని పనులు చేయడం అవసరమా అంటూ కాస్త చురకలు కూడా వేసినట్లు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతెందుకు మెగా ఫ్యాన్స్ లోని మెజారిటీ పీపుల్ …. నిహారికా బుద్దిగా ఇంట్లో కూర్చుని ఉండడమే మాక్కావల్సిందని చెబుతున్నారు. లేనిపోని హీరోయిన్ వేషాలేసి ఆ తర్వాత ఆపదలు కొని తెచ్చుకోవడం అవసరమా అనేది వారి అభిప్రాయం కావచ్చు.
