- Advertisement -

సహజ పదార్దాలతో ముఖం తాజాగా ఉండాలంటే….

- Advertisement -

అందంగా కనపించటానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటాం.

అయితే వాటి ప్రభావం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అందుకే మనకు అందుబాటులో ఉండే సహజమైన పదార్దాలతో ముఖం తాజాగా మెరిసేలా చేయవచ్చు.

1. ద్రాక్ష పండ్లను చిదిమి ముఖానికి బాగా పట్టించి వేళ్ళతో మృదువుగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేస్తే ముఖం తాజాగా కనపడుతుంది.

2. ఒక టమోటాను మెత్తగా చేసి దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

3. గుప్పెడు గులాబీ రేకులను మెత్తని పేస్ట్ చేసి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి పది నిమిషాల తర్వాత కడగాలి.

4. పసుపు యాంటి సెప్టిక్ గా పనిచేసి చర్మాన్ని మెరిపిస్తుంది. దీని కోసం ఒక స్పూన్ పసుపులో కొంచెం అనాస రసం కలిపి ముఖానికి రాసి పది నిముషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -