Monday, April 29, 2024
- Advertisement -

హ‌రికృష్ణ మృతితో ‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైల‌ర్ వాయిదా

- Advertisement -

టీడీపీ మాజీ ఎంపీ, న‌టుడు హ‌రికృష్ణ బుధ‌వారం రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు.దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.హ‌రికృష్ణ మృతిపై పలువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు సంతాపం తెలిపారు.ఇక ఈ రోజు హీరో నాగ‌ర్జున పుట్టిన రోజు కావ‌డంతో ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య న‌టించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌ల‌ని మొద‌టి భావించారు.హ‌రికృష్ణ మృతిలో ట్రైల‌ర్‌ను వాయిదా వేస్తున‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు.

ఇక నాగ‌ర్జున న‌టిస్తున్న ‘దేవదాస్’ సినిమా ఫస్ట్ సింగల్ ను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా నిన్న చిత్ర నిర్మాతలయిన వైజయంతి మూవీస్ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణ వార్త తెలిసిన తర్వాత ఆదిత్య మ్యూజిక్ వారు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నందమూరి కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తమ పాట విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వెల్లడించారు. అఖిల్ న‌టిస్తున్న కొత్త మూవీ ఫ‌స్ట్ లుక్‌ను కూడా వాయిదా వేశారు.

https://www.youtube.com/watch?v=IQJ_1r3jZkM

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -