Wednesday, May 15, 2024
- Advertisement -

అల్లు అర్జున్ స్థానంలో నాగచైతన్య

- Advertisement -

దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. రొటీన్ సినిమాలకు విభిన్నగా చిత్రాలను తెరకేక్కిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ సినిమా తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో  తెరకేక్కించబోతున్నాడట.

అందుకుగాను ఈ సినిమాలో అల్లు అర్జున్, శింబు, పునిత్ రాజ్ కుమార్, ఫాహాద్ పాజిల్ హీరోలుగా అనుకుంన్నాడట. తెలుగులో అల్లు అర్జున్ కి అతని పాత్ర గురించి మరియు సినిమా స్టోరీ వినిపించాడట. ఐతే అల్లు అర్జున్ కథ బాగుంది కానీ ఇప్పుడు ఈ సినిమా చేయలేను నాకు కొంచెం టైమ్ కావాలి అని అడిగడట. దాంతో అల్లు అర్జున్ ప్లేస్ లోకి నాగచైతన్యను హీరోగా తీసుకున్నాడట.

అయితే వివహాం జరిగిన తరువాత నలుగురు స్నేహితులు ఒక సందర్భంలో కలుసుకుంటారట ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. నాగచైతన్యకి కథ బాగా నచ్చడంతో వేంటనే ఒకే చెప్పాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ సినిమాని స్వయంగా గౌతమ్ మీననే నిర్మిస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -