Tuesday, May 21, 2024
- Advertisement -

భలే మంచి రోజు రివ్యూ

- Advertisement -

ఒక పక్క మెగా ఫామిలీ మరొక పక్క నందమూరి ఫ్యామిలీ హీరోలు హల్చల్ చేస్తూ ఉంటే మహేష్ బాబు తరఫున పెద్ద హీరోగా కాలుమొపిన సుదీర్ బాబు సూపర్ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. భలే మంచి రోజు అంటూ కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా వచ్చింది. ఎప్పటి నుంచో వ్యత్యాసమైన కథనాలు ఎంచుకుంటున్నా ప్రేమ కథా చిత్రం తప్ప వేరే ఏ సినిమా హిట్ లేని సుదీర్ బాబు ఈ సినిమా ఏ మేరకు రాణించాడో చూద్దాం. 

స్టొరీ – పాజిటివ్స్ 

హీరో రాం (సుదీర్) కి హై బీపీ అనే పెద్ద సమస్యే ఉంటుంది. దీంతో పాటు ఏదైనా అనుకోని సంఘటన ఎదురు అయ్యి షాక్ తగిలితే కళ్ళు తిరిగి పడిపోతాడు. అలాంటి షాక్ ల సమయంలో ఎవరినైనా నమ్మేసే అతన్ని ఒక అమ్మాయి మోసం కూడా చేస్తుంది.ఆ తరవాత ఆమె మీద ప్రతీకారం కోసం అంటూ వెళ్ళిన హీరో కి శక్తీ అనే గ్యాంగ్ ఎదురు అవుతుంది, అక్కడ నుంచీ కథ – రాం జీవితం ఊహించని మలుపులు తిరుగుతూ సాగుతుంది. సీత అనే అమ్మాయిని కిడ్నాప్ చెయ్యమని ఈ గ్యాంగ్ కోరడం లాంటివి జరుగుతూ కథ సాగుతుంది. సీత ఎవరు ఆమెని కిడ్నాప్ ఎందుకు చెయ్యాలి చెయ్యాల్సిన పరిస్థితి ఏంటి ? ఎలాంటి పరిస్థితి లో సీత దొరికింది లాంటి విషయాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.సుదీర్ బాబు చాలా పెర్ఫెక్ట్ గా చేసాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా ఇంటరెస్టింగ్ గా రాసారు రైటర్ లు, పృధ్వీ తో సాగిన ఎపిసోడ్ హై లైట్ అని చెప్పాలి. సాందాత్  ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా పాజిటివ్ అయ్యింది. సన్నీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా చోట్ల స్క్రీన్ ప్లే కొత్తగా నడిచింది. త్రిల్స్ విషయం లో ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుండేది.

 

నెగిటివ్స్ 

ఫస్ట్ హాఫ్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన పర్ఫెక్ట్ కథనాన్ని సెకండ్ హాఫ్ లో క్యారీ చెయ్యలేకపోవడం పెద్ద డిసప్పాయింట్మెంట్ , ఇలాంటి కొత్త సినిమాలకి కథనం చాల ప్రత్యేకం కానీ అది చాలా చోట్ల స్లో అయ్యింది.మరి కొన్ని చోట్ల డేడ్లీ న్యారేషన్ సాగింది. సాంగ్స్ కూడా అక్కరలేని చోట్ల వచ్చి మరీ ఇబ్బంది పెట్టేశాయి. ఎడిటింగ్ లో మరి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని చెప్పచు.

 

ఫైనల్ గా .. 

భలే మంచి రోజు సినిమా ఓవరాల్ గా సూపర్ అనేలా లేదు అలాగే బాలేదు అనేలా కూడా లేదు. ఓవరాల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ సగం మాత్రమే సక్సెస్ఫుల్ గా తీయగలిగారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండాఫ్ బాలేదు ఒక్క పృథ్వి సీన్ తప్ప… స్టొరీ లైన్ బాగుంది కానీ కథా విస్తరణ బాలేదు. కథనంలో పెద్ద కిక్ లేదు, నేరేషన్ అయితే మరీ స్లోగా ఉంది.  కొత్తదనం కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర అబవ్ ఆవరేజ్ గా రీచ్ అయ్యి తీరుతుంది. ఒక మంచి సినిమాని జనాలు ఎప్పటికీ ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ గా చెప్పచ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -