Friday, May 3, 2024
- Advertisement -

మాస్ లుక్‌లో….. అక్కినేని హీరో

- Advertisement -

పెళ్లి త‌ర్వాత చేస్తున్న అక్కినేని నాగచైతన్య చేస్తున్న సినిమా ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో చైతన్య నలుపు రంగు దుస్తుల్లో తలపై గాయంతో కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన వెనక తొమ్మది చేతులు చాచినట్లుగా ఉన్న ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది.

మాస్ లుక్‌లో పూర్తిగా యాక్ష‌న్ నేప‌థ్యంలో సినిమా రూపొందిస్తున్న‌ట్లు ఫ‌స్ట్‌లుక్‌ను చూస్తుంటే తెలుస్తోంది. తొమ్మిది చేతుల్లో ఓ చిన్నారి, ప్రశ్నార్థకాలు, 21, మహా, అక్క, ప్రేమ గుర్తులు ఫ‌స్ట్‌లుక్‌లో ఉన్నాయి. అయితే ‘సవ్యసాచి’ అంటే చైతూ అర్థం చెప్పాడు.

‘రెండు చేతుల్ని సమర్థంగా, శక్తివంతంగా వాడే వారిని సవ్యసాచి అంటారు. మహాభారతంలో అర్జునుడి ఐదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్యను ప్రదర్శించగలడు. అలాగే ఈ సినిమాలో తన రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు’ అనే నేప‌థ్యంలో ‘సవ్యసాచి’ సినిమా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, త‌మిళ నటుడు మాధవన్‌ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌లో రూపొందిస్తున్నారు. ‘శైలజారెడ్డి అల్లుడు’, శివా నిర్వాణ దర్శకత్వంలో కూడా చైతూ సినిమాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -