Saturday, May 18, 2024
- Advertisement -

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ స్టోరీ ఇదే!

- Advertisement -

మాంచి క‌థ‌తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. అదే ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తీస్తున్న ఈ సినిమా పూర్తిగా సైనిక నేప‌థ్యంలో ఉండ‌నుంది. దీనికోసం అల్లు అర్జున్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్ర‌ధానంగా ఉగ్ర‌వాదంపై ఉండేట్టు తెలుస్తోంది.

స్కూల్‌కి వెళ్తున్న పిల్లలు, ఆఫీసులకు పరిగెడుతున్న ఉద్యోగులు.. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు హడావుడిగా ఉన్న జనాలతో సంద‌డిగా ఉన్న ప్రాంతం ఒక్క‌సారిగా భ‌యాన‌క ప్రాంతంగా మారిపోయి… ర‌క్త‌పుటేరులు పొంగితే.. ఆర్త‌నాదాలు వినిపిస్తుంటే.. ఇది బాంబు పేలిన అనంత‌రం ఉండే ప‌రిణామాలు. ఇది ఉగ్ర‌వాదులు చేసే ప‌ని. ఈ నేప‌థ్యంలోనే ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా ఉండ‌నుంద‌ని స‌మాచారం. జనాలందరూ భయంతో వణికిపోయారు. కర్ఫ్యూ విధించిన త‌ర్వాత అప్పుడే సూర్య ప్ర‌వేశించాడు. పరిస్థితులను చూసి రగిలిపోయాడు. అప్పుడు సూర్య ఏం చేశాడు? బాంబ్‌ బ్లాస్ట్‌ వెనక ఉన్న కహానీ ఏంటీ? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల‌ని చిత్ర‌బృందం చెబుతోంద‌.ఇ

అల్లు అర్జున్ సైనికుడి పాత్ర‌లో ర‌ఫ్‌గా క‌నిపిస్తూ ఈ సినిమాలో ఉన్న హైలైట్‌ సీన్స్‌లో ఈ బాంబ్‌ బ్లాస్ట్‌ సీన్‌ ఒకటి అని సమాచారం. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై లగడపాటి శిరీష శ్రీధర్, ‘బన్నీ’ వాసు సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన రెండు పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -