Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌జిలీ సినిమాతో కొత్త ఇబ్బందుల్లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మజిలీ అందించిన విజయం తో ఎనలేని సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సినిమా విజయం చైతన్య కెరీర్ లో ఒక స్పెషల్ గా మిగిలిపోతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సాధారణం గా ఒక సినిమా హిట్ కాగానే చాలా మంది దర్శకులు ఆ హిట్ అందుకున్న హీరో ని అప్రోచ్ అవుతారు. ఇప్పుడు చైతన్య విషయం లో కూడా అదే జరుగుతుంది. ఇండస్ట్రీ లో ఇక వేరే ఏ హీరో కి అన్ని కథలు వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతం చైతన్య ముందు చాలా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే చైతన్య కూడా ఇలా కథలు వచ్చి పడటం తో సతమతమవుతున్నాడట.

ఏ సినిమా ముందు మొదలు పెట్టాలి అనే విషయం అర్ధం కాక చైతన్య ఒక డైలమా లో ఉన్నాడట. ఆల్రెడీ శేఖర్ కమ్ముల తో ఒక సినిమా అనుకున్న చైతు ప్రస్తుతం వెంకీ మామ తో బిజీ గా ఉన్నాడు. ఇవి కాకుండా హిట్స్ కొట్టిన యువ దర్శకులు కొంత మంది చైతన్య కి కథలు వినిపించారట. మరి ఇలాంటప్పుడే చైతన్య జాగ్రత్తగా ఉంటే మంచి కథలు బయటకు వస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -