- Advertisement -

వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజాకి భాజాపా చెక్‌…? ర‌ంగంలోకి ప్ర‌ముఖ‌ హీరోయిన్‌

- Advertisement -

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఇతర పార్టీల నాయకులతోపాటు , వివిధ రంగాల ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. క‌ర్నాట‌క‌లో ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోని భాజాపా అధికారంలో కి రావ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెట్టింది.

దీనిలో భాగంగా ఇప్ప‌లికే ఆప‌రేష‌న్ క‌మ‌లానికి తెర‌లేపిన భాజాపా అందులో స‌క్సెస్ సాధించింది. ఇప్ప‌టికే టీడీపీ ఎంపీలు ఇత‌ర నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. అన్ని పార్టీల‌కు సినీ గ్లామ‌ర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌న‌గా ఉండ‌టంతో భాజాపా కూడా సినీ గ్లామ‌ర్‌పై దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాజాగా దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి బీజేపీ లో చేరింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ స్వీయ నిర్మాణంలో వచ్చిన తమిళ చిత్రం వళ్ళి ద్వారా చిత్ర రంగానికి పరిచయం అయిన హీరోయిన్ ప్రియారామన్. తమిళ , తెలుగు , మళయాళ , కన్నడ , హిందీ చిత్రాలలో నటించిన ప్రియరామన్ , మంచి నటిగా గుర్తింపు పొందారు. తాజాగా బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాజకీయాల్లో తన రోల్ మోడల్ నరేంద్ర మోడీ అని చెప్పిన ప్రియారామన్‌.. తనకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ స్వతహాగా మలయాళీ. ప్రియారామన్‌ చేరికతో సౌత్‌లో పార్టీకి స్టార్‌ వాల్యూ వస్తుందని ఆ బీజేపీ భావిస్తోంది.

ప్ర‌ధానంగా ఏపీలో ఆమె సేవ‌ల‌ను ఉప‌యేగించుకోనుంది భాజాపా. త్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానం నుండి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సినీ నటి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వాణీ విశ్వనాథ్, దివ్యవాణిలు పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది. కాని వారు ఎవ‌రూ కూడా పోటీకి దిగ‌లేదు.

ప్రియా రామన్ బీజేపీలో చేరితే చిత్తూరు జిల్లా నగరి నుండి రోజాపై పోటీకి దిగుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. అందుకే ఇప్ప‌టినుంచె భాజాపా వ్యూహాత్మ‌కంగా వ్వ‌వ‌హ‌రిస్తోంది. నగరిలో రెండో దపా ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడ సినీ రంగం నుండి వచ్చారు. దీంతో నగరిలో ఆమెను బరిలోకి దింపొచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆమెనె బ‌రిలోకి దింప‌నుంది భాజాపా. ఏది ఏమైనా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ఎంత మేర‌కు గ‌ట్టి పోటీ ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -