Wednesday, May 15, 2024
- Advertisement -

‘తొలిప్రేమ’ త‌ర్వాత ఖుషిగా వ‌రుణ్‌ తేజ్

- Advertisement -

విడుద‌లైన థియేట‌ర్ల‌లో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా విడుదలై మంచి టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమాకు అంద‌రి ప్ర‌శంస‌లు వ‌స్తుండడంతో ఇప్పుడు వ‌రుణ్ ఖుషిగా ఉన్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్ తన తరువాతి సినిమాల‌పై దృష్టి పెట్టాడు. ఇప్ప‌టికే రెండు, మూడు సినిమాల‌కు ఒప్పుకున్న వ‌రుణ్ త‌న సినిమాలు పూర్తి చేసే ప‌నిలో బిజీ అయ్యాడు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అంతరిక్షం – సైన్స్‌కు సంబంధించిన సినిమా తీస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ – భారీ సెట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. కంచె సినిమాను నిర్మించిన రాజీవర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆ త‌ర్వాత నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కథ – స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నారు. ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్ మల్టీస్టారర‌ర్ సినిమాలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌తో కలసి వరుణ్ సినిమా చేస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -