Sunday, May 19, 2024
- Advertisement -

నితిన్‌ను పొగిడేసిన ‘ఛలో’ హీరో

- Advertisement -

సినిమాలు వ‌రుస ప‌రాజ‌యాలు పొంద‌డం.. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో సినిమాలు వ‌దిలేద్దామ‌నుకున్న యువ న‌టుడు నాగ‌శౌర్య ‘ఛలో’ సినిమాతో విజ‌యం అందుకున్నాడు. అయితే ఈ విష‌యంలో అత‌డికి నితిన్ స్ఫూర్తి అని పేర్కొన్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల మీడియా ముందు శౌర్య పంచుకున్నాడు.

సినిమాల్లోకి వెళ్తానంటే తన తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదని, ఇది ఒక మంచి కెరీర్‌గానే చూశారని చెప్పాడు. అయితే స్టార్టింగ్‌లో అవకాశాలు రాకపోవడంతో ఐదేళ్ల కిందట సినిమాలు మానేద్దామని అనుకున్నానని పేర్కొన్నాడు. ఆ స‌మ‌యంలో త‌న తల్లిదండ్రులు వారించి సినిమాల్లో కొనసాగమంటూ ధైర్యం చెప్పారంట‌. తన లాంటి హీరోలు ఒకవేళ సినిమా అవకాశాలు వచ్చినా వరుసగా రెండు ఫెయిల్యూర్లు వస్తే అల్లాడిపోతుంటామ‌ని చెప్పాడు. కానీ హీరో నితిన్ మాత్రం కొన్నేళ్లుగా సక్సెస్ లేకున్నా మొండి ధైర్యంతో ఉండ‌డం త‌న‌కు స్ఫూర్తి అని నితిన్‌పై పొగ‌డ్త‌లు కుమ్మ‌రించాడు. ఇటీవ‌ల శౌర్య న‌టించిన ‘ఛలో’ సినిమా త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -