Monday, May 6, 2024
- Advertisement -

పార్టీనేత‌ల‌తో జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర కీల‌క స‌మావేశం…

- Advertisement -

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, నేతలతో భేటీ కానున్నారు. ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ఏమీ చేయకపోయినా, ఏదో సాధించేసినట్టు టీడీపీ నేతలు చేస్తున్న హడావుడి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తీరుపై భేటీలో చర్చ జరగనుంది.

బడ్జెట్ కేంద్రంగా వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం పార్టీ ఎంపిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. గడచిన నాలుగు బడ్జెట్లలోనూ కేంద్రం ఏపికి అన్యాయం చేసినా నొరెత్తని చంద్రబాబునాయుడు ఇపుడు మాత్రం హటాత్తుగా కేంద్ర అన్యాయం చేసిందంటూ రాద్దాంతం చేస్తున్నట్లు మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడుతున్నట్లు ధ్వజమెత్తారు.

ప్రత్యేకహోదా వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వైసిపి చెప్పినపుడు హేళన చేసిన చంద్రబాబు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే హడావుడి చేస్తున్నట్లు జగన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలను సమీక్షిస్తూనే భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకే జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించటంపై కూడా ఈ సమావేశంలో జగన్ తమ పార్టీ నేతలతో చర్చిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -