Monday, May 20, 2024
- Advertisement -

విజ‌య్ స‌ర‌స‌న నిహారిక

- Advertisement -

కొణిదెల కుటుంబం నుంచి ఎంతో మంది వార‌సులు వ‌చ్చారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యింది. కానీ ఫ‌లితం నిరాశ మిగిలింది. అయినా వెబ్ సిరీస్‌లు, చిన్న తెర‌లో క‌నిపిస్తూ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల‌నే తండ్రితో క‌లిసి ఓ వెబ్ సిరీస్ ప్రారంభించారు. దాని ప్రొమోకు విశేష స్పంద‌న వ‌స్తోంది. తెలుగులో పెద్ద‌తెర అరంగేట్రం అచ్చి రాలేదు. ఒక మనసు చిత్రం అంద‌రికీ న‌చ్చినా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ఆ అమ్మ‌డు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేసిన నిహారిక కోలీవుడ్‌కు వెళ్లింది. ఓ మంచి ఆఫర్ రావడంతో అటు వైపు వెళ్లింది. స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇప్పటికే చాలా భాగం ఆ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అని సినిమా పేరు. విజయ్ సేతుపతితో పాటు కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్ముగ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ చిత్రంలో నిహారిక లుక్ అదిరిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో నిహారిక ఉంది. ఒంటి నిండా ఆభరణాలు వేసుకొని రాజ‌ద‌ర్పం ఒలికించేలా వ‌స్ర్త‌ధార‌ణ ఉంది. అయితే ఈ సినిమా విష‌యాలు ఇంకా అధికారికంగా ఏమి బ‌య‌ట‌కు రాలేదు. నిహారికను చూస్తుంటే ఇదేదో రాజ‌రిక‌పు సినిమానా అనే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

https://www.youtube.com/watch?v=l_acdw5GXQ0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -