Thursday, May 9, 2024
- Advertisement -

ప్రియాంకను తోసింది ఎవ‌రూ..

- Advertisement -
  • హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియో

బాలీవుడ్‌లో న‌టించి మెప్పించిన భామ ప్ర‌స్తుతం హాలీవుడ్‌కు వెళ్లింది. ఇప్పుడు అక్క‌డ కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆ బ్యూటీ ఎవ‌రూ కాదు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె తన అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అయితే ఓ వీడియోలో ఆమెను కారులోంచి కింద‌కు ప‌డేస్తున్నది ఎవ‌రో తెలియ‌డం లేదు. ఆమెను కింద‌కు ఎందుకు ప‌డేశారోన‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసుకొని త‌ల పీక్కున్నారు.

ఇంత‌కు ఆయ‌న ఎవ‌రో కాదు తాను న‌టిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో తోటి స‌హ‌చ‌ర న‌టుడు. ప్రస్తుతం ఆమె క్వాంటికో వెబ్‌సిరీస్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోంది. ఆ స‌మ‌యంలో తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన సహ నటుడు రస్సెల్‌ టోవీతో కనిపించారు. ఈ వీడియోలో రస్సెల్‌ ప్రియాంకను కదులుతున్న కారు నుంచి కిందికి తోసేశాడు. ఆమె కిందపడినా సరే నవ్వుతూనే ఉంది. నిజానికి అది వారు వెళ్తున్న‌ది కారులోనే. కానీ కారు కదలడం లేదు. అక్క‌డ‌ ఉన్న స్క్రీన్ మాత్ర‌మే క‌దులుతోంది. ఒక్కసారిగా చూసేసరికీ ఆమె కదులుతున్న కారు నుంచి కిందపడినట్లు కనిపిస్తుంది. ప్రియాంకచోప్రా ‘జై గంగాజల్‌’ చిత్రంతో రెండేళ్ల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత హిందీలో మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఆమె హాలీవుడ్‌ సినిమా, సిరీస్‌ షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ప్ర‌స్తుతం మూడు హిందీ చిత్రాల్లో నటించేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -