Saturday, May 4, 2024
- Advertisement -

రాజ‌ధానికి అడ్డుపడుతున్న‌ది చంద్ర‌బాబెనా…?

- Advertisement -
  • వ‌చ్చె ఎన్నిక‌ల‌కోసం మ‌రో గ్రాఫిక్స్ రాజ‌ధాని…రెడీ.

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మానం పునాదుల స్థాయిలోనె కునారిల్లుతోంది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి మూడున్న‌ర్ర సంవ‌త్సరాలు గ‌డుస్తున్నా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీడీపీ…కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది మిత్ర ప‌క్షం భాజాపా. కాని రాజ‌ధాని నిర్మానం మాత్రం ముందుకు సాగ‌డంలేదు. ఏమ‌న్నంటె ప్ర‌తిప‌క్షం అడ్డుకుంటోంద‌ని వితండ వాదం చేయ‌డం బాబునుంచి మంత్రుల‌దాకా అదేప‌ని. అస్స‌లు రాజ‌ధానికి అడ్డు ప‌డుతున్న‌ది చంద్ర‌బాబె అన్న అనుమ‌నాలు క‌లుగుతున్నాయి.

అస‌లు విష‌యానికి వ‌స్తె ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ నేతలు రెండు మూడేళ్ళుగా ఒకే మాట చెబుతున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతోందని గ్రాఫిక్స్‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డం త‌ప్పా మ‌రో క‌టి లేదు. రాజ‌ధాని నిర్మానం, పెట్టుబ‌డుల‌కోసం ప్ర‌జా ధ‌నంతో దేశాలు తిరుగుతున్నా దానికి త‌గ్గ ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డంలేదు. అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే రెండేళ్ళు పూర్తయిపోయింది.చెంబెడు నీల్లు ఇచ్చి చేతులు దులుపు కున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని అమరావతి నిర్మానం పునాదుల స్థాయిలోనె ఉంది. అప్పటినుంచీ ఇప్పటిదాకా అమరావతిలో జరిగిన ఒకే ఒక్క మార్పు.. అదే అమరావతి పరిపాలనా ప్రాంగణం. అక్కడ సెక్రెటేరియట్‌, అసెంబ్లీ.. ఇవి మాత్రమే నిర్మితమయ్యాయి.

అంతా బాగానే వుంది కాని అమరావతి నిర్మాణాన్ని ఎవరు ఆపుతున్నట్లు.? చంద్రబాబు మాటల్లో అయితే, ప్రతిపక్షం అడ్డుపడుతోంది. అస‌లు విష‌యానికి వ‌స్తె డిజైన్లను చంద్రబాబు ఖరారు చేయకపోవడానికి కారణమేంటట.? ఇక్కడా వైఎస్‌ జగన్‌ అనుమతి కావాలేమో.. అంటారా.? అస‌లు చంద్ర‌బాబుకె డిజైన్లు న‌చ్చ‌డంలేదు. మొన్నీమధ్యనే విదేశాలకు వెళ్ళి, డిజైన్లను ఖరారు చేసి వచ్చారు చంద్రబాబు.

రాజమౌళి దర్శకత్వంలో, లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థతో చంద్రబాబు సమావేశమయి, డిజైన్లను ఖరారు చేశారు. ఇదిగో, అదిగో.. అంటూ వ్యవహారాన్ని తాజాగా సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ లెక్కన, రాజధానికి ‘అడ్డం’ పడుతున్నది చంద్రబాబు కాక ఇంకెవ‌రు అపుతున్నారు. అదిగో ఇదిగో అంటె సార్వత్రిక ఎన్నికలు. 2014 ఎన్నికల్లో చూపించిన గ్రాఫిక్స్‌కి కొంచెం మెరుగులు దిద్ది, కొత్త గ్రాఫిక్స్‌ని చంద్రబాబు చూపించబోతున్నారంతే.

రాజ‌ధాని నిర్మానం జ‌ర‌గ‌కుండా అడ్డుప‌డుతున్న‌ది చంద్ర‌బాబె. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అడ్డుపడటం, దాన్ని మళ్ళీ ప్రతిపక్షం మీద నెట్టేయడం బ‌హూశా ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఇలాంటి సీఎం ఉండ‌రేమో. అందుకె తీరా ఎన్నిక‌ల స‌మ‌యాన‌కి ఇదిగో రాజ‌ధాని నిర్మానం ప్రారంభం అయ్యింది ఇది పూర్తి కావాలంటె మ‌ళ్లీ టీడీపీకి అధికారం ఇవ్వండ‌ని మాట‌లు చెప్ప‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -