మాములుగా తెలుగు పరిశ్రమలో హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు. హీరోలు పరిచయం అవుతున్నప్పుడు మాత్రం అడ్డు చెప్పరు పైగా ప్రోత్సహిస్తారు కానీ అమ్మాయిలు వస్తున్నప్పుడు మాత్రం ఎందుకు అడ్డు చెబుతారు? ఏం? అంటూ మెగా బ్రదర్ నాగబాబు ని ఎదిరించి మరీ ప్రశ్నించిందట దాంతో సమాధానం చెప్పలేక పోయాడట నాగబాబు. సో అందుకే నిహారిక కు ఏమాత్రం అడ్డు చెప్పడం భావ్యం కాదని నిర్ణయించుకొని హీరోయిన్ గా పరిచయం చేయడానికి అంగీకారం తెలిపాడు నాగ బాబు.
తెలుగు సినిమాకు మా కుటుంబం అంకితం ,అలాగే దయచేసి ఆడపిల్ల లను చిన్న చూపు చూడకండి వాళ్ళలో కూడా ప్రతిభ దాగి ఉంది దాన్ని బయటకు తీయండి, అంతేకాని త్వరగా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి గుండెలపై బరువు తొలగించుకుందాం అని మాత్రం ఆలోచించకండి అంటూ ఆడపిల్ల ల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసాడు నాగబాబు.
నిహారిక హీరోయిన్ గా నటించిన ” ఒక మనసు ” ఆడియో వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ వేడుకకు మెగా హీరోలు చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లతో పాటు నాగబాబు, అల్లు అరవింద్ తదితరులంతా హాజరై నిహారిక గొప్ప నటి కావాలని ఆశీర్వదించారు.
