Friday, March 29, 2024
- Advertisement -

మామయ్య కి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన సమంత

- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర లో ఈ రోజు విడుదల అయిన సినిమా మన్మధుడు 2. ఈ సినిమా పై ముందు నుంచి అందరికీ ఎంతో మంచి అభిప్రాయం ఉంది. ట్రైలర్ వచ్చే అంత వరకు సినిమా మీద పాజిటివ్ బజ్ ని కాపాడుకుంటూ వచ్చారు దర్శక నిర్మాతలు. అయితే ఆసక్తికరంగా, ఈ సినిమా ట్రైలర్ విడుదల అప్పుడు సమంత మొదట నాగార్జున కి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిందట. దానికి కారణం లేకపోలేదు.

సినిమా ట్రైలర్ చివరన నాగార్జున, “ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ బట్ ఐ మేక్ లవ్” అని చెప్పిన డైలాగ్ ని సమంత మొదట జీర్ణించుకోలేకపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున నే మీడియా తో ముచ్చటించేప్పుడు వివరించాడు. అయితే ఈ సినిమా ట్రయిలర్ విడుదల అయ్యాక సమంత నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాక, నాగార్జున సమంత కి వివరణ ఇచ్చాడట.

నటుడు కావడం తో కొన్ని సార్లు పాత్ర ఎలాంటి సన్నివేశాలు డిమాండ్ చేసినా చేయడానికి సిద్ధం గా ఉండాలని, లేకపోతే పరిపూర్ణత్వం రాదని నాగార్జున సమంత కి చెప్పాడట. సమంత కూడా నటి అయినా తన ఇంట్లో వాళ్ళు అలాంటి పాత్రలు చేసే సరికి ఒక్కసారిగా తీసుకోలేకపోయిందట కానీ తర్వాత మాత్రం కథ తెలుసుకొని సంతోషం వ్యక్తం చేసిందని నాగార్జున తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -