పాట ట్రైలర్ రివ్యూ: పాట ట్రైలర్ తోనే వివాదం సృష్టిస్తున్న ఆర్ జీ వి

- Advertisement -

కాంట్రవర్షియల్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ తనకు తానే సాటి. ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ అంటూ లక్ష్మీపార్వతి మరియు ఎన్టీఆర్ ల బంధం గురించి చూపిస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల చేశారు. ఈ సినిమాలో టీడీపీ మరియు చంద్రబాబునాయుడును విలన్ గా చూపించిన వర్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ గెలుపు మీద ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా చేయనున్నారు. జనరల్ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన వైసిపి మీద ఈ సినిమా కథ ఉండబోతుందట.

తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ చూస్తేనే ఈ పాట పలు వివాదాలకు దారి తీసేలానే కనిపిస్తుంది. ఈ సినిమా వైసీపీ మీద కాబట్టి ఈ సినిమాలో కూడా టీడీపీ వర్గాల ని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

- Advertisement -

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -