- Advertisement -

మామకు థ్యాంక్స్ చెప్పిన రామ‌ల‌క్ష్మి

- Advertisement -

రంగస్థలం సినిమా ఘనవిజయంతో అటు అభిమానులు, ఇటు తారాగణం సంబరపడిపోతున్నారు. చిత్ర విజ‌యంపై అన్నీ వైపుల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.తాజాగా అక్కినేని నాగార్జున ‘రంగస్థలం’పై ట్విటర్‌ వేదికగా స్పందించారు. రామ్‌చరణ్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. ఇక నా ముద్దుల కోడలు సమంత.. పల్లె పడచులా, పక్కింటి అమ్మాయిలా ఎంత సక్కగున్నదో లచ్చిమి.. అంటూ అభినందించారు.

అద్భుత నటనతో పాత్రకు ప్రాణం పోశావ్ అని మెచ్చుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ మంచి సినిమాను తెరకెక్కించావ్…మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేశావ్ అన్నారు.నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ మేకర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.నాగార్జున ప్రశంసలకు ఉబ్బితబ్బిబైన సమంత… థ్యాంక్స్ మామ అంటూ స్వీట్ రిప్లై ఇచ్చింది. మామ, కోడలు ఆప్యాయతను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాంచరణ్ అభిమానులు కూడా నాగార్జునకు థ్యాంక్స్ చెబుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -