Sunday, May 19, 2024
- Advertisement -

కాపు బ్రహ్మాస్త్రం వైకాపాలోకే….. చంద్రబాబు, పవన్‌లకు అదిరిపోయే షాక్

- Advertisement -

2014 ఎన్నికల్లో కూడా విభజనకు కారణమైన కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జగన్‌ని ఓడించడం కోసమే చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చిన సబ్బం హరి ఈ సారి అధికారికంగా టిడిపిలో చేరుతున్నాడు. ఈ చేరికపై టిడిపి నేతలు హంగామా చేస్తున్నారు కానీ విభజనకు ముందు నుంచే కిరణ్ కుమార్ రెడ్డి-చంద్రబాబుల బంధం, సోనియాతో ఇద్దరూ కుమ్మక్కయిన విధానం అందరికీ తెలుసు. ఇక సబ్బం హరి కూడా ఆ తాను ముక్కే అన్న స్పష్టత వైకాపాకు ఉంది. అయితే సబ్బం హరి చేరుతున్న ఆనందం కంటే ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరుతున్నాడన్న వార్త టిడిపిలో భయాందోళనలు పెంచింది.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ముద్రగడ పద్మనాభం టిడిపి సర్వనాశనమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు అని చెప్పాడు. ఇక చంద్రబాబు మోసాలు, దారుణాల గురించి సవివరంగా చెప్పుకొచ్చాడు. లోకేష్ అవినీతి వ్యవహారాలకు తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరమని తనకు ఆహ్వానం వచ్చిందని …….అయితే పవన్ కళ్యాణ్‌ని తాను సీరియస్ నాయకుడిగా చూడడం లేదని చెప్పుకొచ్చాడు ముద్రగడ పద్మనాభం. సినిమాలను పూర్తిగా వదిలేస్తే అప్పుడుగానీ పవన్ గురించి ఏమీ చెప్పలేమన్నాడు. సంవత్సరానికి పది రోజులు కూడా ప్రజల మధ్య ఉండలేని పవన్ నాయకత్వం, సామర్థ్యం గురించి ఏం చెప్తాం, ఏం నమ్ముతాం అన్నాడు ముద్రగడ.

టిడిపి, జనసేనలను ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విమర్శించిన నేపథ్యంలో 2019 నాటికి ముద్రగడతో పాటు ఆయన అనుచర నాయకులు, అభిమానులు అందరూ కూడా వైకాపలో చేరడం ఖాయం అయింది. గోదావరి జిల్లాలతో పాటు కాపుల్లో కూడా ముద్రగడ పద్మనాభానికి చాలా మంచి పేరు ఉంది. ఆయన నిజాయితీని చాలా మంది అభిమానిస్తారు. అలాంటి నాయకుడు వైకాపాలో చేరితే 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలతో పాటు కాపులు అధికంగా ఉండే అన్ని జిల్లాల్లోనూ వైకాపాకు భారీగా లబ్ది చేకూరుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ అంశమే టిడిపి, జనసేనల్లో టెన్షన్ పెంచుతోంది. 2019 ఎన్నికల్లో గెలుపోటములను కాపులే డిసైడ్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా ఘంటాపథంగా చెప్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం స్థాయి నాయకుడు వైకాపాలో చేరితే ఆ పార్టీకి బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుందని ఎనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేల్లోనూ వైకాపా గెలుపు ఖాయం అని స్పష్టమవుతున్న నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, ముద్రగడ పద్మనాభంలాంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికలే వైకాపా కార్యకర్తలు, అభిమానులకు, నాయకులకు పూర్తివిశ్వాసాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -