Sunday, April 28, 2024
- Advertisement -

నా సామి రంగ..ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే!

- Advertisement -

కింగ్ నాగార్జున లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఈ సినిమాతో విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్… ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందేను అనౌన్స్ చేశారు.

స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో నాగార్జున పల్లెటూరి ట్రాక్టర్ పై కాలు పెట్టి లుంగీలో కనిపిస్తూ ఉన్నాడు. మరోసారి పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ మాస్ ఎలిమెంట్స్ తో నాగార్జున రానున్నట్లుగా తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరితో నిర్మిస్తోంది. నాగ్ సరసన ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంక్రాంతి రేసులో నాగార్జునకు మంచి ట్రాక్ ఉంది. గతంలో సంక్రాంతి ఫెస్టివల్‌కు వచ్చిన సినిమాలన్ని హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో నా సామిరంగపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అల్లరి నరేష్ కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -