Sunday, April 28, 2024
- Advertisement -

నితిన్ – నాని…బాక్సాఫీస్ వార్!

- Advertisement -

టాలీవుడ్ వద్ద బాక్సాఫీస్ మధ్య ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే క్రిస్మస్ కానుకగా ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ మధ్య యుద్ధం జరగనుండగా ఈ వారం నాని, నితిన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. నాని నటించిన హాయ్ డిసెంబర్ 7న విడుదల కానుండగా నితిన్ నటించిన ఎక్స్‌ట్రాడినరీ మ్యాన్ డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్స్ గా వస్తుండగా రెండింటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక తండ్రి,కూతురు అనుబంధంతో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. క్లాసిక్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీపై బారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా దసరాతో హిట్ కొట్టిన నాని ఆ సినిమాలో ఊర మాస్‌ పాత్రలో కనిపించనుండగా హాయ్ నానిలో కంప్లీట్ క్లాస్‌ పాత్ర పోషించారు. ముఖ్యంగా నాని – మృణాల్ మధ్య రొమాన్స్ అదుర్స్. ట్రైలర్, సాంగ్‌లో వీరిద్దరి కెమిస్ట్రి సూపర్బ్‌గా ఉండటంతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాని.

నితిన్ – వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్స్ ట్రాడినరీ మ్యాన్. నాని సినిమా విడుదలైన ఒకరోజు తర్వాత ఈ మూవీ రిలీజ్ కానుండగా నితిన్ మార్క్ ఎంటర్‌టైన్ పక్కా అని తెలుస్తోంది. నితిన్ సరసన శ్రీ లీల నటిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. మొత్తంగా ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టడం ఖాయమని చెబుతుండగా బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -