Saturday, May 3, 2025
- Advertisement -

హిట్ కోసం మలయాళ మూవీని నమ్ముకున్న నాగ్?

- Advertisement -

కింగ్ నాగార్జున కు గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ మద్య ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన మూవీ తరువాత నాగ్ నటించిన ఏ మూవీ కూడా సరైన విజయం అందుకోలేదు. రాజు గారి గది 2, మన్మథుడు 2, ఆఫీసర్, వైల్డ్ డాగ్, ఇలా ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన బంగార్రాజు పవరలేదనిపించినప్పటికి, మళ్ళీ ఘోస్ట్ తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో నాగ్ పనైపోయిందనే వార్తలు బాగా ఊపందుకున్నాయి. ఇలాంటి తరుణంలో నాగ్ అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. .

దీంతో ఈసారి హిట్ కోసం రీమేక్ మూవీపై కన్నెశాడట ఈ మన్మథుడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ” పోరింజు మరియమ్ జోస్ ” మూవీలో నటించేందుకు నాగార్జున ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని నాగ్ భావిస్తున్నాడట. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు ? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతుంది అనే వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మద్య మలయాళ మూవీస్ ను రీమేక్ చేసేందుకు తెలుగు హీరోలు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, చిరంజీవి ” గాడ్ ఫాదర్ ” మూవీస్ మలయాళ రిమేక్స్ అన్న సంగతి తెలిసిందే. దాంతో హిట్ కోసం నాగ్ కూడా మలయాళ మూవీనే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరి నాగ్ ” పోరింజు మరియమ్ జోస్ ” మూవీ రీమేక్ తోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

అందరి దృష్టి సమ్మర్ పైనే!

రాంచరణ్ తో ఉప్పెన డైరెక్టర్..ఎన్టీఆర్ చలువే ?

ఊహలకు అందని రీతిలో సలార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -