రాంచరణ్ తో ఉప్పన డైరెక్టర్.. ఎన్టీఆర్ కేం సబంధం?

Ram Charan, Buchi Babu Sana team up for a Sports Drama
Ram Charan, Buchi Babu Sana team up for a Sports Drama

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ” RC 15 ” చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మూవీ తరువాత చరణ్ సినిమా ఏది అనేది ఇండస్ట్రీ లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ. ఆ మద్య గౌతమ్ తిన్ననూరితో మూవీ ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపించినప్పటికి, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక కన్నడ దర్శకుడు నార్థన్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే వీరిద్దరు కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చరణ్ మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అంటుతున్న విశ్వసనీయ సమాచారం.

ఇప్పటికే బుచ్చిబాబు చరణ్ తో కథ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు కూడా చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉప్పెన మూవీ రిలీజ్ అయి రెండేళ్ళు దాటిన ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్దం చేసుకొని ఆయన డేట్స్ కోసం ఎదురుచూశాడు. అయితే తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి కూడా కమిటయ్యాడు.

దీంతో ఎన్టీఆర్ కోసం ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి అయెంత వరకు ఎదురుచూడక తప్పదు. ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యే సరికి మరో మూడేళ్ళ సమయం పట్టే అవలశం ఉంది. దీంతో బుచ్చిబాబును చరణ్ కు రిఫర్ చేశాడట తారక్. ఎన్టీఆర్ చలువతోనే బుచ్చిబాబు చరణ్ కు కథ చెప్పాడని, అది కూడా తారక్ కోసం సిద్దం చేసిన కథేనని, టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ మరి ఎన్టీఆర్ కోసం సిద్దం చేసిన కథలో చరణ్ నటిస్తుండడంతో ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. మరి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంభంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికి, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండట.

ఇవి కూడా చదవండి

బాలయ్యతో అనిల్ రావిపూడి రిస్క్ చేస్తున్నాడా ?

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!