Wednesday, May 1, 2024
- Advertisement -

సమ్మర్ హీట్ పెంచుతోన్న స్టార్ హీరోలు!

- Advertisement -

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ సీజన్ ఏదైనా ఉందంటే టక్కున సమ్మర్ సీజన్ అని ఎవరైనా చెప్పేస్తారు. ఎందుకంటే సమ్మర్ సినిమాల జోరు మామూలుగా ఉండదు. విద్యార్థులకు దాదాపు రెండు నెలలు సెలవులు రావడంతో ఈ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీలో గట్టిగానే పోటీ ఉంటుంది. ఇక ఇప్పటికే సంక్రాంతి రేస్ లో ఉన్న హీరోలెవరో తేలిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్ సీజన్ పై పడింది. ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పటికే చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకొని రెడీగా ఉన్నాయి. మొదట సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసిన హీరోలలో ప్రభాస్, మహేశ్ ఉన్నారు. అయితే వీరిద్దరి సినిమాలు ఇప్పుడు సమ్మర్ కు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే సలార్ సమ్మర్ నుంచి తప్పుకొని వచ్చే సెప్టెంబర్ కు వాయిదా పడింది. .

ఇక మహేశ్ త్రివిక్రమ్ మూవీ ఏప్రెల్ 28న రిలీజ్ అని ప్రకటించినప్పటికి, ఈ మూవీ కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రెండు మూవీస్ ను పక్కన పెడితే, మార్చి మూడో వారంలో ” డిజే టిల్లు 2 ” తో సమ్మర్ హడావిడి మొదలౌతుంది. ఆ తరువాత మార్చి నాలుగో వారంలో నాని ” దసరా ” మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ మూవీ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఆ వెంటనే ఏప్రెల్ 7 న రవితేజ ” రావణాసుర ” మూవీ రిలీజ్ కానుంది. ఇక ఏప్రెల్ 14 న మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళా శంకర్ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇక ఏప్రెల్ మూడో వారం లో నాగచైతన్య, విక్రమ్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న ” కష్టడి ” మూవీ రానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” హరి హర వీరమల్లు ” మూవీ కూడా ఈ సమ్మర్ లోనే రానుంది. మొత్తానికి వరుస సినిమాలతో ఈ సమ్మర్ ను స్టార్ హీరోలు మరింత హిట్ పెంచబోతున్నారనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

రాంచరణ్ తో ఉప్పెన డైరెక్టర్..ఎన్టీఆర్ చలువే ?

తెలుగు సినిమాలకు చెమటలు పట్టిస్తున్న “కాంతార”

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -