Sunday, May 19, 2024
- Advertisement -

వర్మ కొత్త పోరీని చూశారా గురు

- Advertisement -

Myra Sareen రామ్ గోపాల్ వర్మ ఒక్కో సీజన్లో ఒక హీరోయిన్ పై పడుతుంటాడు. వన్స్ ఆ సుందరి నచ్చితే ఆమెతోనే వరుస బెట్టి సినిమాలు చేసేస్తుంటారు. గతంలో ఈ కాన్సెప్ట్ ను మనం చాలాసార్లు చూశాం. ఇపుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే… నాగార్జున- వర్మ కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తుంది. షూటింగ్ కూడా మొదలైంది. వర్మ సొంత బ్యానర్‌లో తెరకెక్కి స్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ రోల్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమెని ఎంపిక చేయడం కూడా జరిగిపోయిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ రోల్ పై క్లారిటీ ఇచ్చేశాడు వర్మ. తన మూవీ ద్వారా హీరోయిన్‌గా కొత్త బ్యూటీని తీసుకున్నామని, ఆమె పేరు మైరా సరీన్ అని.. కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు.

Myra Sareen

ఈ స్టోరీ ఇలా ఉంటే… సినిమా ప్రొడక్షన్ విషయంలో హీరో-ప్రొడ్యూసర్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. వర్మ సొంత బ్యానర్ మీదే ఈ మూవీ షురూ అయినప్పటికీ ‘కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్’ మ్యాటర్లో వర్మతో నాగ్ ఏకీభవించలేదని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మైరా సరీన్ తో తాను చేయలేనంటూ నాగ్ తెగేసి చెప్పేశాడట. హీరోయిన్ విషయంలో ఇద్దరి మధ్య కాస్త డిబేట్ జరిగినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. నాగ్ వెర్షన్ లో చూస్తే… తనకు సీనియర్ హీరోయిన్ కావాలంటున్నాడట. అలా గనుక చేస్తే బడ్జెట్ మరింత పెరుగుతుందన్నది వర్మ భయం. అందుకే తన స్టైల్ లో నాగ్ తో వాదించి తాను సెలెక్ట్ చేసిన భామనే హీరోయిన్ గా తీసుకున్నాడని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -