Monday, May 20, 2024
- Advertisement -

వంచ‌న‌కు మారు పేరే చంద్ర‌బాబు

- Advertisement -

చంద్ర‌బాబుది అదే అప్పుడు ఎప్ప‌డు ఒక‌టే ధోర‌ణి ప్రజ‌ల‌ను మోసం చేయ‌డం. వాళ్ల‌ని న‌మ్మించి ఓట్లు వేయించుకున్న త‌రువాత వారిని గాలికి వదిలేయడం.నేను మారిన చంద్ర‌బాబుని ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి అని గ‌త ఎన్నిక‌ల్లో త‌ను చేసిన త‌ప్పుని త‌నే ఓప్పుకున్న ఘ‌నుడు చంద్ర‌బాబు.ఇప్పుడు కొత్త నాట‌కానికి తెర లెప్పాడు.అది కుడా పోల‌వ‌రం ప్రోజేక్టు సాక్షిగా.

చంద్రబాబు – నరేంద్రమోడీ.. ఇద్దరూ ఇద్దరే.! రాజకీయాల్లో ఎత్తుకు పైయెత్తులు వేసుకుంటూ, పైకొచ్చినవారే ఈ ఇద్దరూ.! స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటుపొడిచి రాజకీయంగా చంద్రబాబు ఎదిగితే, సీనియర్లను తొక్కి నరేంద్రమోడీ ఎదిగారు. పబ్లిసిటీ స్టంట్స్‌ విషయంలో ఒకర్ని మించినవారు ఇంకొకరు.! చంద్రబాబుకి ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదులుకున్నారట.. మోడీ మాత్రం ప్రధాని అయ్యే అవకాశాన్ని సృష్టించుకున్నారు, ఆ పదవిలో కూర్చున్నారు.

ఇక, ఈ ఇద్దరి గురించిన చర్చ ఎందుకంటే, ‘మీకో దండం..’ అంటూ నరేంద్రమోడీ విషయంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది గనుక.! దాదాపు నాలుగేళ్ళ బంధం మోడీ – నరేంద్రమోడీది. అంతకు ముందు మోడీని చంద్రబాబు చాలా సందర్భాల్లో విమర్శించారు. కానీ, నాలుగేళ్ళ నుంచి సీన్‌ మారిపోయింది. చంద్రబాబు, మోడీ భజనలో మునిగితేలుతున్నారు. రాజకీయంగా మోడీతో పోల్చితే, చంద్రబాబే సీనియర్‌.

కానీ, ‘పొజిషన్‌’ విషయంలో మోడీ చాలా ఎత్తులో వున్నారు కాబట్టి.. తప్పదు, చంద్రబాబు – మోడీ భజన చేసి తీరాల్సిందే. చంద్రబాబు అవసరాలూ, మోడీ వద్ద చంద్రబాబు అణిగిమణిగి వుండడానికి కారణంగా చెప్పుకోక తప్పదు. ఓటుకు నోటు సహా చాలా విషయాల్లో మోడీ ఆశీస్సులతో చంద్రబాబు బయటపడ్డారు. వ్యక్తిగత రాజకీయ అవసరాల్ని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో కూడా మోడీకి చంద్రబాబు మోకరిల్లడమే అత్యంత దారుణమైన విషయం.

మోడీ, ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేశారా.? లేదా.? అన్నది తర్వాతి ప్రశ్న. కానీ, మోడీని నమ్మి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని చంద్రబాబు వంచించారన్నది నిర్వివాదాంశం. కానీ, ఇప్పుడు చంద్రబాబుని ప్రశ్నించడం, విమర్శించడం వల్ల ఉపయోగం లేదు. కేంద్రం దిగి వచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోరాటం జరగాలి. కానీ, అంత ఓపిక ఎవరికి వుంది.? అన్ని రాజకీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటయ్యే పరిస్థితే లేదు. తెలుగుదేశం పార్టీ తన గొయ్యిని తానే తవ్వేసుకుంది. అందులోపడి, కేంద్రాన్ని ప్రశ్నించినా.. అది శుద్ధ దండగ.

ప్రత్యేక హోదాని మించిన ప్యాకేజీ ఇవ్వబోతున్నాం.. అని కేంద్రం చెబితే, చంద్రబాబు తలకాయ ‘ఊపారు’. హోదా లేదు, ప్యాకేజీ లేదు.. రైల్వే జోన్‌ కూడా రాకపాయె.! అయినా, చంద్రబాబు – మోడీని ప్రశ్నించలేకపోయారు సరికదా.. కేంద్రాన్ని ఎవరన్నా విమర్శిస్తే, చంద్రబాబుకి కోపం నషాళానికెక్కిపోయేది. ఇప్పుడేమయ్యింది.? కేంద్రంపై చంద్రబాబే గుస్సా అవుతున్నారు. అదన్నారు, ఇదన్నారు.. ఏదీ ఇవ్వలేదంటూ చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెట్టాల్సి వస్తోంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఓసారి వంచనకు గురయ్యింది.. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వంచనకు గురవుతోంది. అప్పుడు మన్మోహన్‌ సర్కార్‌ వంచిస్తే, చంద్రబాబు చేతకానితనాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ వంచిస్తే, చంద్రబాబు ఓవరాక్షన్‌ చేశారు. రెండోసారి వంచన అత్యంత దారుణం.

ఇన్ని తెలివితేట‌లు ఉన్న చంద్ర‌బాబు దీనిని ప్ర‌తిప‌క్ష నేత కుట్ర అని అంటాడు ఏమో చూద్దం..చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు ఏవిధాంగా ఉన్న‌యో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -