Monday, May 6, 2024
- Advertisement -

సమంతను తల్చుకొని భయపడుతున్న నాగార్జున

- Advertisement -

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత.. నిజ జీవితంలో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 6, 7 తేదీల్లో వీరి పేళ్లి అంగరంగ్ వైభవంగా గోవాలో జరగనుంది. అయితే నాగ చైతన్య, సమంతల గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ.. తన కోడలు సమంతను తానే దెయ్యంగా చూడలేకపోతున్ననని.. ఇక నా కొడుకు నాగ చైతన్య ఎలా చూస్తాడోనంటూ నవ్వుతూ అన్నారు.

పైగా ఇద్దరూ ఒకే గదిలో ఎలా పడుకుంటారో అని అన్నారు. అయితే, తన భార్య అమల దెయ్యంలాంటిది కాదని… వెరీ బ్యూటీఫుల్ అని కితాబిచ్చారు. ఈ మూవీలో సమంత చాలా బాగా నటించిందని.. మూవీలో అక్కడ అక్కడ కనిపిస్తుందని అన్నారు. చివరి 20 నిమాషాలు మాత్రం తన పర్ఫామెన్స్ అదరగొట్టిందని అన్నారు. ఈ మూవీ హిట్ అయితే.. ఖచ్చితంగా సీక్వెల్ చేస్తానని తెలిపారు.

ఇక నాగ చైతన్య, సమంతల పెళ్లి గురించి మాట్లాడుతూ.. మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌- స‌మంత వివాహం జ‌రుగుతుంద‌ని అన్నారు. పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయాల‌ని చైత‌న్య త‌న‌ను అడిగాడని చెప్పారు. క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం జ‌రిపిస్తున్నామ‌న్నారు. ఈ పెళ్లికి 100 మంది మాత్రమే హాజరవుతారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -