Saturday, May 25, 2024
- Advertisement -

టీడీపీ షాక్.. వైసీపీలోకి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?

- Advertisement -

ఏపీలో వలసలు పరంపరం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల సమయాన్నికి ఇరు పార్టీల నేతలు తమ తమ రాజకీయ భవిషత్తు కోసం ఏ పార్టీలో ఉండాలో డిసైడ్ చేసుకుంటున్నారు. ఈ నెపథ్యంలో అధికార టీడీపీ పార్టీలో ఉన్న కొందరు నేతలు వైసీపీలో చేరాడానికి రెడీ అవుతున్నారు. అయితే టీడీపీ పార్టిలో చాలా కాలంగా ఉంటు.. పార్టీనే నమ్ముకొని సేవలు చేస్తున్న సీనియర్ నేతలను మర్చిపోయి.. పదవి కోసం వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేయడం పట్ల సినీయర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారం కోసం నేతలను చంద్రబాబు వాడుకుంటారని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. నిన్నటికీ నిన్న అధికార టీడీపీకి చెందిన మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే బొజ్జల, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా..గోరంట్ల, బండారు తది తర ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామా కూడా చేశారు. అంతేకాక.. బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ రాజీనామా చేస్తానని మీడియా ముందు ప్రకటించి.. తర్వాత బాబు మాయకు నిశబ్ధం అయ్యారు. కానీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. తన ఆశ నెరవేరడం కష్టమే అని.. ఇప్పుడు పార్టీ మారేందుకు రేడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పై ఆశ చూపించి మోసం చేశారు.

అంతేకాకుండా ఇటీవల జరిగిన పార్టీ పదవుల్లో కూడా తనను తీవ్రగా అవమానించారని.. వేణుగోపాల్ రెడ్డి త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారు. పార్టీ మారిన వారికి.. నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చరని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం న‌ర‌సారావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు తర్వాత ఆ సీటు ఆయన కొడుకు కి బాబు కేటాయిస్తాడు అని టీడీపీ వర్గాలు చెప్తుండటంతో.. వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీలోకి జంప్ చేసే యోచ‌న‌లో ఉన్న మోదుగుల ప‌ల్నాడులోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని ఊహాగానాలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -