- Advertisement -

షర్మిలకు అక్కడ ఎంపీ స్థానం ఓకే చేసిన జగన్

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా..? షర్మిల కు లోక్ సభ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేశారా..? వచ్చే ఎన్నికలకు మరో ఏడాదిన్నార టైం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని జగన్ కేటాయించారా అంటే.. వైసీపీ శ్రేణులు అవును అనే అంటున్నారు.

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా లోక్ సభ నియోజకవర్గం నుండి షర్మిల ఎంపీగా పోటీకి దింపేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు.. వైసీపీ శ్రేణులు అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రస్తుత ఆ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ అవినాష్ రెడ్డికు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి షర్మిలను ఎంపీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం జిల్లాలో మంచి పట్టు ఉండటంతో షర్మిలను రంగంలోకి దించితే పార్టీకి అన్నివిధాలా మంచి జరుగుతోందని పార్టీ నేతలు ,కార్యకర్తలు ,వైఎస్ అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారట.

ప్రస్తుతం ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తమ కుటుంబ సభ్యుడు కావడంతో జగన్ మాటకు విలువ ఇచ్చి తన సోదరి కోసం కడపను త్యాగం చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిలకు జగన్ ఆ స్థానన్ని ఇస్తే.. ఎంతవరకు మేలు జరుగుతుఉందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -