Sunday, May 19, 2024
- Advertisement -

కింగ్ నాగార్జున మరో అవతారం!

- Advertisement -

 కింగ్ నాగార్జున అన్నమయ్య చేస్తే శభాష్ అన్నారు. శ్రీరామదాసుగా మురిపిస్తే….. ఆహా అన్నారు.షిరిడీ సాయినాదుడిగా అలరిస్తే.. నీకు నువ్వే సాటి అన్నారు.మరి ఇపుడు వెంకటేశ్వరుని భక్తుడైనటువంటి హథీరామ్ బావాజిగా  చేస్తే ఏమంటారు..?

త్వరలో ఈ వెంచర్ ను నాగ్ ,ద‌ర్శ‌కేంద్రుడు సెట్స్ మీదకు తీసుకు వెళ్లబోతున్నారు. ఇంతకాలం నాగ్ …ఏం చేసినా అలరించిన సినీ జనాలు నాగ్ బావాజి పాత్రను కూడా ఎంకరేజ్ చేస్తారానే ఆశ‌తో యూనిట్ ఉంది.ఇక బావాజి క‌థ విష‌యానికొస్తే….. కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన బావాజి ప్ర‌తి రోజు మూడు నాలుగుసార్లు తిరుమ‌ల గుడికి వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకునే వాడు. కొంత‌కాలానికి అత‌నిపై సందేహం వ‌చ్చి గుడి నిర్వాహ‌కులు అత‌న్ని గుడి నుంచి గెంటివేయ‌డం అత‌ను…. స్వామి వారికోసం శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో వెంకటేశ్వ‌రుడి అత‌ని భ‌క్తికి న‌చ్చి చివ‌ర‌కు అత‌నితో పాచిక‌లు కూడా ఆడాడ‌ని చెబుతారు.కాలక్ర‌మం బావాజి జీవ స‌మాధి అయిన‌ట్లుగా గుడికి చేరువ‌లో ఆయ‌న స‌మాది ఉంటుంది.మ‌రీ అన్న‌మ‌య్య అంత‌టి గొప్ప‌వాడు కాక‌పోయిన‌ప్ప‌టికీ… బావాజి కుండే ప్రాముఖ్య‌త బావాజీకి ఉంది. అయితే హ‌థీరామ్ బావాజీ క‌థ‌ను ముందుకు నాగార్జున ,రాఘువేంద్ర‌రావులు జ‌నాల్లోకి తీసుకుపోదామ‌ని చూస్తున్నారు. ఆత‌రువాత నాగ్ తో సినిమా రూపొందించి వ‌ర్క‌వుట్ చేద్దామ‌ని చూస్తున్నారు.ఎప్ప‌టిలాగానే ఈసినిమాకు కీర‌వాణి,జేకే భార‌విలు వ‌ర్క్ చేయ‌బోతున్నార‌ట‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -