Friday, May 3, 2024
- Advertisement -

సమంత బంగారం అంటున్న నాగార్జున

- Advertisement -

అక్కినేని ఫ్యామిలోలో ఇప్పుడు పెళ్లి కళ కనిపిస్తోంది. నాగ‌చైత‌న్య, సమంత పెళ్లి అయ్యి.. వారం రోజులు అవుతున్నా.. ఇప్పటికే అదే ఆనందంలో ఉన్నారు అక్కినేని కుటుంబ స‌భ్యులు. తాజాగా రాజుగారిగ‌ది 2 ప్ర‌మోష‌న్ కోసం కోడ‌లితో క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చాడు నాగార్జున‌.

సినిమా విష‌యాల‌తో పాటు కోడ‌లి గురించి కూడా చాలా విష‌యాలు చెప్పాడు కింగ్ నాగార్జున. ప్రధానంగా సినిమాలో స‌మంత న‌ట‌న చూసి తానే షాక్ అయ్యానంటున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ లో త‌న కోడ‌లి న‌ట విశ్వ‌రూపం చూస్తారంటున్నాడు నాగార్జున‌. స‌మంత ఆ స్థాయిలో న‌టిస్తుంద‌ని తాను కూడా ఊహించ‌లేద‌న్నాడు ఈ హీరో. సినిమాలో స‌మంత ఉండేది కాసేపే అయినా కూడా ఈ సినిమానే త‌న‌పై న‌డుస్తుంద‌ని చెప్పాడు నాగార్జున‌.

ఇక పర్సనల్ గా చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ సాధించాల‌ని తాను గ‌ట్టిగా కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు నాగార్జున‌. కోడ‌లు పెళ్లితో పాటే విజ‌యాన్ని కూడా తీసుకొచ్చింద‌ని జీవితాంతం గుర్తుండిపోయేలా రాజుగారిగ‌ది 2 ఉంటుంద‌ని న‌మ్ముతున్నట్లు చెప్పాడు నాగార్జున‌. మొత్తానికి నా కోడ‌లు బంగారం అంటున్నాడు నాగార్జున.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -