Tuesday, May 7, 2024
- Advertisement -

ప్ర‌జెంటేష‌ణ్ ఇవ్వ‌నున్న …పికె….

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్ట‌బోతున్న పాద‌యాత్ర‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేపుతోంది. ఒక వైపు సీబీఐ కోర్టు అనుమ‌తి మ‌రో వైపు పాద‌యాత్ర రెండుకూడా రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. కోర్టు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతె పాద‌యాత్ర ఎలా చేయాల‌న్న‌దానిపై నెలాఖ‌రున మ‌రో సారి కీల‌క స‌మావేశం నిర్వ‌హించ బోతున్నారు. ఈస‌మావేశంలో పికె కీల‌క పాత్ర పోషించ‌బోతున్నారు.

నవంబర్ 2వ తేదీ నుండి జగన్ మహా పాదయాత్ర మొదలవుతోంది కదా? అందుకనే పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే స‌మాచారం పంపారట. సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పికె) కీలకమైన ప్రజంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం.

రాష్ట్రంలో వైసీపీ పరిస్ధితిపై తాను చేయించిన సర్వే నివేదికలను ప్రశాంత్ కిషోర్ జ‌గ‌న్‌కు వివరిస్తారనె వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకూ మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించారు. ప్ర‌ధానంగా పార్టీ బ‌లాలు,బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టిసారించారు. ఇప్ప‌టికె రెండు సార్లు స‌ర్వేచేయించార‌ని…వాటి నివేదిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ ముందుంచుతున్నారు.

నవంబర్ 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్న జగన్ పాదయాత్రకు ముందుగా హోలుమొత్తం మీద పార్టీ పరిస్ధితిపై ఓ ప్రజంటేషన్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రశాంత్ చెప్పగా జగన్ అందుకు అంగీకరించారట. 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై జగన్ కు పూర్తిస్ధాయి సమాచారం ఉంటుందన్నమాట. ఆ నివేదిక‌ల ఆధారంగానె పాద‌యాత్రలో స‌ర్దుబాట్లు చేయ‌నున్నారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -