Friday, May 3, 2024
- Advertisement -

హ‌లో క‌థ ఏంటో తెలుసా?

- Advertisement -
  • చెప్ప‌క‌నే చెప్పిన నాగార్జున‌
  • ఆడియో విశాఖ‌, ప్రీరిలీజ్ హైద‌రాబాద్‌లో

త‌న త‌న‌యుడికి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థానం క‌ల్పించాల‌ని అక్కినేని నాగార్జున చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. హ‌లో సినిమానంతా త‌న భుజాల‌పై మోసుకొని ప్ర‌చార బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ నుంచి ట్రైల‌ర్ వ‌ర‌కు అన్నీ తానే చూసుకున్నాడు. ఇప్పుడు సినిమా పాట‌ల విడుద‌ల‌, ప్రీరిలీజ్ వేడుకలు విశాఖ‌ప‌ట్ట‌ణంలో, హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తామ‌ని కింగ్ నాగ్ ప్ర‌క‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ్ విలేక‌రుల స‌మావేశంలో హ‌లో సినిమా గురించి మాట్లాడారు. అయితే ఈ ముచ్చ‌ట్లో ప‌డి సినిమా క‌థ‌ను చెప్ప‌క‌నే చెప్పారు. అవినాష్‌గా మారిన శీనుకి ఈరోజు అది చాలా ముఖ్యమైన రోజు. అనుకోని సంఘటనలు ఆ రోజు అతడి జీవితాన్ని ఎలా మార్చాయో సినిమా ఉండ‌నుంది.

ఒక యంగ్ అబ్బాయి అమ్మాయి చిన్నతనంలో అనుకోని కారణాలతో వారిద్ద‌రూ విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఓ నంబర్ ఇచ్చి వెళుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఆ హీరో, హీరోయిన్ ఇచ్చిన నంబర్‌కి కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ స‌మాధానం ఉండదు. నిరాశ చెంది ఆమె కోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. అందుకే హలో అనే టైటిల్ సెట్ చేశామని చెబుతూ.. సినిమా కథ మొత్తం ఒక్కరోజు జరిగే కథగా ఉంటుందని నాగ్ తెలిపాడు. మధ్యలో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందట.

అఖిల్ స‌ర‌స‌న కల్యాణి ప్రియదర్శన్ న‌టిస్తుండ‌గా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విల‌న్ పాత్ర‌లో అజ‌య్, త‌ల్లిదండ్రులుగా జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. యాక్షన్ సీన్స్, పాట‌లు, ఆరాటం ఇలా అన్నీ క‌లుపుతూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఉంది. డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -