అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ లవ్వాటలు.. ఇండస్ట్రీలనే కాదు. మామూలు జనాల్లోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకేసారి.. ఇద్దరు కొడుకుల ప్రేమ కథలు బయటికి రావడాన్ని నాగార్జున ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని అంతా అనుకున్నారు. కానీ.. చాలా డీసెంట్ గా వ్యవహారాన్ని చక్కదిద్దాలని నాగార్జున డిసైడైపోయినట్టు కనిపిస్తోంది.
తను ఎవరితో జీవిస్తే సంతోషంగా ఉంటాడో అన్న విషయంలో.. చైతూ తీసుకున్న నిర్ణయంపై ఆనందంగా ఉన్నా.. అంటూ రీసెంట్ గా నాగార్జున కామెంట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే.. అఖిల్ కూడా తన లైఫ్ పార్ట్ నర్ విషయంలో క్లారిటీ ఉన్నాడని నాగ్ చెప్పేసినట్టు తెలుస్తోంది. దీంతో.. ఇద్దరి నిర్ణయాలనూ కాదనేది లేదని.. వారు సెలెక్ట్ చేసుకున్న వాళ్లతోనే పెళ్లిళ్లు చేస్తానని నాగ్ స్పష్టం చేసినట్టు అర్థం అవుతోంది.
అన్నీ కుదిరితే.. వచ్చే డిసెంబర్ లోనే.. సమంతతో నాగచైతన్య, తను కోరుకున్న అమ్మాయితో అఖిల్ పెళ్లి కూడా చేసేద్దామని అక్కినేని కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సెలెబ్రిటీల వ్యవహారం కాబట్టి.. ఈ ముచ్చటపై అందరూ ఆసక్తి చూపిస్తుండడంతో.. త్వరగా డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాలనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Related